నార్కట్‌పల్లి, 14 November
భువనగిరి 2002 బ్యాచ్ విద్యార్థులు ప్రమాదానికి గురైన మిత్రుడు దాసరి రవికుమార్ ను పరామర్శించి, కుటుంబానికి రూ. 40,000 ఆర్థిక సహాయం అందించారు.
మన భువనగిరి 2002 బ్యాచ్‌కు చెందిన ఆత్మీయ మిత్రుడు దాసరి రవికుమార్ గారికి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసి, మా క్లాస్మేట్స్ అందరం స్పందించి, ఈరోజు ఆయనను పరామర్శించి, ఆయనకు మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించడం జరిగింది.
ఈ సందర్భంగా మా మిత్రబృందం తరఫున రూ. 40,000/- (నలభై వేల రూపాయలు) ఆర్థిక సహాయంగా అందజేశాము.
ఈ ఆపద సమయంలో ఆర్థిక సహాయంతో పాటు, ఒకరికొకరం అండగా నిలబడటం, కష్టాల్లో ఉన్న మిత్రుడికి ధైర్యాన్ని ఇవ్వడం మా స్నేహబంధంలోని గొప్పతనానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ మంచి కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించి, మానవత్వాన్ని చాటుకున్న మా భువనగిరి గ్రూప్‌లోని ప్రతి ఒక్క అన్నదమ్ముడికి హృదయపూర్వక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు.
స్నేహం అంటే కేవలం కలిసి చదువుకోవడం, కలిసి నవ్వుకోవడం మాత్రమే కాదు కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడటమే నిజమైన స్నేహం అని మేము భావిస్తున్నాము.
మా మిత్రుడు దాసరి రవికుమార్ గారు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మనందరి మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మా స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలి. మన ఐక్యత మరెందరికో ఆదర్శం కావాలి.
ఇట్లు, మన భువనగిరి 2002 మిత్రబృందం






