రాయికల్, 21 September
మండల పరిధిలోని అల్లీపూర్ బైపాస్ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు కాలనీవాసులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని, దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు.
మండల పరిధిలోని అల్లీపూర్ బైపాస్ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు కాలనీవాసులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని, దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. స్వామివారికి మహిళలు అత్యంత నిష్ఠతో సిద్ధం చేసిన 41 రకాల నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాలనీవాసులందరూ ఏకమై నిర్వహించిన ఈ దీపోత్సవం, నైవేద్యాల సమర్పణ కార్యక్రమంతో బైపాస్ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.












