సిద్దిపేట, 19 November
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించి, రూ.995 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించగా, మరో రూ.451.13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించారు. దుబ్బాక, లో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా స్కూళ్లకు భూమిపూజ చేశారు. అలాగే ఆరు తహసీల్దార్ కార్యాలయాలు, 14 విద్యుత్ సబ్స్టేషన్లకు సంబంధించిన పనులను చేపట్టారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మెడికల్ కాలేజీకి తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకుడు మదన్మోహన్ పేరు పెడతామని ప్రకటించారు.
మాజీ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తూ, 2029లో మరోసారి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.







