రాయికల్, 2026-11-21
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో పశువులకు సకాలంలో వైద్యం అందక ప్రాణాపాయం వాటిల్లుతోందని, దీనివల్ల తాము ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అల్లీపూర్ పశువైద్యశాలలో శాశ్వత వైద్యుడిని నియమించి, మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వైద్యుడు లేకపోవడం వల్ల పశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఇది తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని వారు వాపోతున్నారు.







