రాయికల్, 13 September
జగిత్యాల జిల్లా మండలం అల్లీపూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైడర్స్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గణనాథుని ఆగమన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) సుధీర్ రావు హాజరై, ఏర్పాట్లను పరిశీలించారు.
అల్లీపూర్ గ్రామంలో ఘనంగా గణేష్ ఆగమనం: బందోబస్తును పర్యవేక్షించిన ఎస్సై (జగిత్యాల): మండలం అల్లీపూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైడర్స్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గణనాథుని ఆగమన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) సుధీర్ రావు ప్రత్యేకంగా హాజరై, ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు. యువత ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రైడర్స్ యూత్ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.












