జగిత్యాల జిల్లా మండలం అల్లీపూర్ గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కేఎఫ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం మూడవ రోజు పూజా కార్యక్రమాలకు 4వ వార్డు సభ్యులు కల్లెడ గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యులు కల్లెడ గంగాధర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు, కేఎఫ్ యూత్ సభ్యులు కలిసి వార్డు మెంబెర్ కల్లెడ గంగాధర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామంలో భక్తిభావం పెంపొందేలా యువత ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని గంగాధర్ కొనియాడారు. ఈ పూజా కార్యక్రమంలో బర్ల గంగాధరి, ఎలక్ట్రిషియన్ ప్రశాంత్, గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షులు తోపారపు రాజశేఖర్, గొడండ్ల మహేందర్, బర్ల గంగాధర్, ఎంబారి సతీష్ లతో పాటు కేఎఫ్ యూత్ సభ్యులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












