జగిత్యాల జిల్లా మండలం అల్లీపూర్ గ్రామంలో విశ్వకర్మ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ రాజా రాజేశ్వర స్వామి దేవాలయంలో విశ్వబ్రాహ్మణ కుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వకర్మ భగవానుడిని భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పొలస సురేష్, శేఖర్, మధుసూదన్, నరహరి, శ్రీహరి, సురేష్, రాము, నరేష్, మణికంఠ, మనీష్లతో పాటు పలువురు కులబంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ విశ్వకర్మ సృష్టికి మూలపురుషుడని, ఆయన ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.












