నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త, హరిబాబును గుర్తుతెలియని ముగ్గురు దుండగులు కారులో వచ్చి కత్తితో పొడిచి హత్య చేశారు. రాజారాజేంద్ర చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగింది. హత్య దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబును నరికిన దుండగులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గతంలో అదనపు కట్నం కోసం గర్భవతిగా ఉన్న భార్య, యూట్యూబర్ వైష్ణవిని హరిబాబు హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబు ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు.
తాజాగా జరిగిన ఈ హత్యకు, వైష్ణవి హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హరిబాబు హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సమాచారం అందుకున్న రెండో టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య వెనుక అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.






