పట్టణ ఆర్య వైశ్య సంఘంలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు. వారు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు.
పట్టణ ఆర్య వైశ్య సంఘంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులను, ఆర్య వైశ్య సంఘం సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య, జిల్లా ఆర్టీవో కమటాల శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, కౌన్సిలర్లు ప్రశాంత్ రావు, శ్రీనివాస్, రాజ్ కుమార్, కూసరి అనిల్, గోలి శ్రీనివాస్, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు ఊటూరి నవీన్, పెద్ది శ్రీనివాస్, బొడ్ల జగదీశ్, బట్టు రమేష్, పెద్ది చిరంజీవి, పల్లెర్ల రాజ, అనంతుల శ్రీనాథ్, కప్పల శ్రీకాంత్, చంద్రకాంత్, ఆర్య వైశ్య సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.












