శ్రీ భక్త మార్కండేయ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ గాయత్రి దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాల కరపత్రాన్ని పద్మశాలి సేవా సంఘం మార్కండేయనగర్ అడహక్ కమిటీ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్కు అందజేశారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.
శ్రీ భక్త మార్కండేయ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ గాయత్రి దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాల కరపత్రాన్ని పద్మశాలి సేవా సంఘం మార్కండేయనగర్ అడహక్ కమిటీ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్కు అందజేశారు.
ఈ సందర్భంగా ఆడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, శ్రీ గాయత్రి దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు జగిత్యాల ప్రజలందరిపై ఉండాలని, భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
అనంతరం నూతనంగా ఏర్పాటైన పద్మశాలి సేవా సంఘం మార్కండేయనగర్ అడహక్ కమిటీ సభ్యులకు ఆడువాల జ్యోతి లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టే ఆధ్యాత్మిక, సామాజిక, సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ బాలె చంద్రశేఖర్, కో-కన్వీనర్ వీరబత్తిని అనిల్ కుమార్, కోశాధికారి సింగం గంగాధర్, కమిటీ సభ్యులు కుసుమ వినయ్, సిరిపురపు రాజలింగం, బాలె మురళీధర్, వడ్డెపెల్లి శ్రీనివాస్, బాలె సత్యనారాయణ, సింగం భాస్కర్, నందగిరి నర్సయ్య, ఆడెపు జానయ్య, కౌన్సిలర్ మానపురి పవిత్ర మహేష్, మాజీ అధ్యక్షుడు ఆకుబతి శ్రీనివాస్, ఎనిగేటి నరసయ్య, భగవత్ బాంధవులు తదితరులు పాల్గొన్నారు.












