జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.

అధికారుల పరిశీలన
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి గణేష్ నిమజ్జనం చేసే ప్రదేశాలను పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రత, బందోబస్తు, అవసరమైన సౌకర్యాలు తదితర అంశాలపై వారు ఆరా తీశారు.
సమన్వయంతో పనిచేయాలి
వేడుకలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులు సూచించారు. నిమజ్జనానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.