వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయికల్ పట్టణ శివారులోని వాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆయన ఎస్పీ అశోక్కుమార్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలను నిర్వహించి, ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారులకు సహకరించాలని కోరారు.
అవసరమైన వసతులు
నిమజ్జన ప్రదేశంలో వేదిక, విద్యుత్ దీపాలు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భారీ క్రేన్లు, చిన్న క్రేన్లను అవసరానికి అనుగుణంగా సిద్ధంగా ఉంచాలని, పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. భక్తులు, పిల్లలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలను కట్టుదిట్టం తెలిపారు.
సమన్వయంతో పనిచేయాలి
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జన వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. భక్తులంతా శాంతియుత వాతావరణంలో వేడుకలను జరుపుకోవాలని కోరారు.
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.












