రాజేంద్రనగర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డెర సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గుంజ రాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
రాజేంద్రనగర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డెర సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గుంజ రాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
వీర మణికంఠ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భజన కార్యక్రమంలో మక్కల శశిధర్, మన్నె మహాత్మారావు తదితరులు ఆలపించిన గానామృతంతో భక్తులు, ప్రజలు తాదాత్మ్యంలో మునిగిపోయారు. భజన పాటలతో కార్యక్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. భక్తులు భజన పాటలకు తన్మయత్వంతో నృత్యాలు చేస్తూ గణనాథుడిని స్మరించుకున్నారు.
భక్తుల భాగస్వామ్యం
ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు, భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వేముల లక్ష్మి, వేముల విజయలక్ష్మి, మక్కల పూజ, వేముల హరిత, వేముల మంజుల, కొమేర చంద్రకళ, కొమిరె రేణుక, వేముల మౌనికతో పాటు గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.