మండలం అల్లీపూర్ గ్రామంలో శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం గణపతి నిమజ్జన ఉత్సవం వైభవంగా జరిగింది. స్థానిక శివాలయం నుండి బయలుదేరిన శోభాయాత్ర గ్రామంలోని పురవీధుల గుండా సాగి, కోనమ్మ చెరువులో నిమజ్జనం చేశారు.
అల్లీపూర్ గ్రామంలో శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం గణపతి నిమజ్జన ఉత్సవం సందర్భంగా, స్థానిక శివాలయం నుండి బయలుదేరిన గణపతి శోభాయాత్ర గ్రామంలోని పురవీధుల గుండా ఘనంగా సాగింది. అనంతరం స్థానిక కోనమ్మ చెరువులో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళహారతులతో స్వాగతం పలికారు. గణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ నిమజ్జనోత్సవంలో సంఘం అధ్యక్షులు వేముల సతీష్, ప్రధాన కార్యదర్శి మోర శివకుమార్, కోశాధికారి పొట్టవత్తిని నాగభూషణం, ఉపాధ్యక్షులు సిరిపురపు ఆనందం, అనుమల్ల మల్లేశం, సంయుక్త కార్యదర్శులు బొమ్మకంటి సురేష్, రఘు, ప్రచార కార్యదర్శి మిట్టపల్లి జగన్ తో పాటు సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












