నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటర్మీడియట్ తర్వాత న్యాయవిద్య అభ్యసించే అవకాశాలపై విద్యార్థులకు వారు వివరించారు.
న్యాయవిద్యపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు న్యాయవిద్య అభ్యసించేందుకు పలు విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష రాసి న్యాయవిద్యను అభ్యసించవచ్చని వారు పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులో నల్సార్ న్యాయ కళాశాల విద్యార్థులు నైనిక, సుమేధ, శ్రేయంషి పాల్గొని, కళాశాల విద్యార్థులకు న్యాయవిద్య ప్రాముఖ్యత, అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డివిజన్ నాయక్, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.







