పీఆర్సి సాధనకు కృషి చేస్తామని పీఆర్టియు టిఎస్ జిల్లా అధ్యక్షులు యాల్ల అమర్నాథ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపెల్లి ఆనంద్ రావు అన్నారు. మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో వారు మాట్లాడారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి, వారి సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తామని వారు హామీ ఇచ్చారు. పాఠశాలల, ఉపాధ్యాయుల అభివృద్ధికి కూడా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గాజంగి రాజేశం, జాదవ్ వసంత రావు, గాజుల కిరణ్, బెజ్జంకి హరికృష్ణలను ఘనంగా సన్మానించారు. ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన కడుకుంట్ల అభయ్ రాజ్ ను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టియు టిఎస్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అంతడుపుల గంగారాజం, దొంతి సతీష్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాపర్తి నర్సయ్య, కన్నవేని మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పొన్నం రమేష్, బొమ్మకంటి రవి కుమార్, రాష్ట్ర కార్యదర్శి లక్కడి రాజరెడ్డి, హైస్కూల్ ఇంచార్జి రాజా రాజశేఖర్, తరంగిని, శోభ, సుజాత, రమ, ఇతర సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












