చింతకాని మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. నల్ల చెరువు కట్ట అభివృద్ధికి 7 కోట్ల పైగా నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
చింతకానిలో ఉన్న నల్ల చెరువు కట్ట అభివృద్ధి పనులకు దాదాపు 7 కోట్ల పైగా నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఈ పనులకు సంబంధించి శిలాఫలకాన్ని శ్రీ మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆవిష్కరించి, కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.
అనంతరం చింతకాని గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని సందర్శించి, స్వామివారి దర్శనంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు, ఈవో రామకోటేశ్వరరావు, గుడి చైర్మన్ ఎండపల్లి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ కోలా ఉమారాణి, మండల అధ్యక్షులు కన్నెబోయిన గోపి, మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు, కూరపాటి కిషోర్ తో పాటు మండల, గ్రామ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



