విశ్రాంత పోస్టుమాస్టర్, కబడ్డీ నాగయ్యగా పేరుగాంచిన జాతీయ కబడ్డీ పితామహుడు, హుజూర్నగర్ వాస్తవ్యుడు కస్తారి నాగయ్య మరణం వారి కుటుంబానికి, క్రీడాకారులకు తీరని లోటని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్నగర్ శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో నాగయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, చిత్రపటానికి నివాళులర్పించారు.
విశ్రాంత పోస్టుమాస్టర్, కబడ్డీ నాగయ్యగా పేరుగాంచిన జాతీయ కబడ్డీ పితామహుడు, హుజూర్నగర్ వాస్తవ్యుడు కస్తారి నాగయ్య మరణం వారి కుటుంబానికి, కబడ్డీ క్రీడాకారులకు తీరని లోటని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్నగర్ శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో నాగయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యం యస్ విద్యా సంస్థల సీఈఓ యస్ యస్ రావు, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని, అధ్యాపకులు జిఎల్ఎన్ రెడ్డి, పందిరి ఫౌండేషన్ సభ్యులు గోపి రాథోడ్, కుటుంబ సభ్యులు సునీల్, పలువురు బంధువులు, మిత్రులు పాల్గొన్నారు.












