జిల్లాలో ప్రభుత్వ భూమిని కాపాడేందుకు తాను చేస్తున్న నిరాహార దీక్షకు అనుమతి నిరాకరించడంపై భీమా నాయక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వంద కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికే అప్పగించే ప్రయత్నానికి అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
జిల్లాలో తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో భీమా నాయక్ మాట్లాడారు. తాను బలమైన ప్రతిపక్ష నాయకుడిని కాదని, అధికార పార్టీకి చెందిన నాయకుడిని కాదని, అయినప్పటికీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నానని ఆయన తెలిపారు.
వంద కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అప్పగించడానికి తాను పోరాటం చేస్తుంటే, అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. భీమా నాయక్ నిరాహార దీక్షకు ఎందుకు భయపడుతున్నారని, భూ మాఫియాకు చెందిన మార్వాడీ ఓం నారాయణను కాపాడేందుకే ఈ అడ్డంకులు సృష్టిస్తున్నారా అని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ భూమి విషయంలో ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న భీమా నాయక్ పోరాటానికి అనుమతి నిరాకరిస్తే, ప్రజల్లో అనుమానాలు రావడం సహజమని ఆయన అన్నారు. ప్రభుత్వ భూమి కబ్జాదారుడైన ఓం నారాయణ వైపే అధికారులు నిలుస్తున్నారనే భావన ప్రజల్లో కలిగితే, దానికి బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు.
మా ఓపిక ఉన్నంతవరకు సహకరిస్తామని, కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని ఆయన హెచ్చరించారు. రేపటి పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారు జరగరానిది జరిగితే బాధ్యత వహించాలని ఆయన కోరారు. కుటుంబ సభ్యుల బాధ్యత వహించాలని భీమా నాయక్ ఆరోపించారు.











