జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తనయుడే తండ్రిని కర్రతో కొట్టి హత్య చేశాడు. శనివారం మేడి వెంకటేశం అనే వ్యక్తిని అతని కుమారుడు లక్ష్మణ్ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తనయుడే తండ్రిని కర్రతో కొట్టి హత్య చేశాడు. శనివారం రోజున నేరెళ్లకు చెందిన మేడి వెంకటేశంను అతని కుమారుడు లక్ష్మణ్ కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
కుటుంబ కలహాలే కారణమా
కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












