కేశంపేటలో మండల అధ్యక్షుడు పాలాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు, అమిత్ షా ర్యాలీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముచింతల గ్రామ సర్పంచ్ వడ్డే చంద్రయ్య హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

నూతన మండల అధ్యక్షుడు పాలాది శ్రీనివాస్ నాయకత్వంలో కార్యకర్తలు ఐకమత్యంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అలాగే పార్టీ సభ్యత్వాలను విస్తృతం చేయడంతో పాటు, అమిత్ షా ర్యాలీ విజయవంతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని, ప్రతి గ్రామంలో కొత్త కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తూ గ్రామస్థాయిలో పార్టీ విస్తరణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సోప్పరి నరసింహ, మున్నూరు యుగంధర్, కంచుకోట నరసింహ, అంజయ్య, కాణం ఉదయ్, మోటే శ్రీను, భక్తవత్సలం, కమ్లికార్ వెంకటేష్ జి, గోగికార్ నర్సింగ్, సానేముని రాజు, తట్టేపల్లి నరసింహ, పుట్నాల సాయి, కంచుకోట మణికంఠ, యాదగిరి, కల్వకోలు తిరుపతి, వేణు, రావుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.