జయశంకర్ భూపాలపల్లి, 2026-06-05
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ కార్మిక విభాగం జిల్లా కన్వీనర్‌గా ఉప్పు రాజును నియమించారు. ఈ నియామకంపై ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పు రాజు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ కార్మిక విభాగం జిల్లా కన్వీనర్‌గా ఉప్పు రాజును నియమించారు. ఈ నియామకంపై ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు.
తన నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు అందే శ్రీనివాస్, భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్, జిల్లా అధ్యక్షులు ఎడునూతుల నిశిధర్ రెడ్డిలకు ఉప్పు రాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత 30 ఏళ్లుగా బీజేపీ కార్యకర్తగా పార్టీకి సేవలందిస్తూ, మండల కార్యవర్గ సభ్యునిగా, మత్స్యశాఖ మండల కన్వీనర్‌గా, ఓబీసీ జిల్లా సహకార దర్శిగా, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన తన సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా తన నియామకానికి సహకరించిన మండల అధ్యక్షుడు, జిల్లా నాయకులు, బూత్ అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలందరికీ ఉప్పు రాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఉప్పు రాజు తెలిపారు.












