Hanumakonda/Shayampet (ధర్మ రథం) సెప్టెంబర్ 12
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణానికి మట్టి వినాయక ప్రతిమలను పంపించినందుకు ఆయన సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.
భక్తితో పూజిద్దాం...పర్యావరణాన్ని కాపాడుదాం... మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణానికి మట్టి వినాయక ప్రతిమలను పంపించినందుకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.మట్టి గణేశుడి ప్రతిమలను పూజించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవచ్చని అన్నారు. ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పిలుపునిచ్చారు. ఎల్లుండి అనగా తేది 14.09.2026 నాడు జరుపుకోబోయే వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ *వినాయక చవితి* శుభాకాంక్షలు తెలిపారు.












