రంగారెడ్డి, 14 September
కేశంపేట్ మండలంలోని ఎక్లాస్ఖాన్పేట గ్రామంలో గన్ టీమ్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఎక్లాస్ఖాన్పేటలో ఘనంగా వినాయక చవితి వేడుకలు భక్తి గీతాలు ఆలపించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కేశంపేట్: మండలంలోని ఎక్లాస్ఖాన్పేట గ్రామంలో గన్ టీమ్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి మొక్కులు చెల్లించి, అనంతరం భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తులను అలరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. వినాయకుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలతో పాటు ఎక్లాస్ఖాన్పేట గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అంజయ్య యాదవ్ ఆకాంక్షించారు.












