రాయికల్, 14 September
మండలంలోని ఇటిక్యాల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో, గౌడ యూత్ సారధ్యంలో మట్టి వినాయకుని విగ్రహ ప్రతిష్టా మహోత్సవం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు గౌడ సంఘ భవనం వరకు సాగింది. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడిని ప్రతిష్టించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
*ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు* మండలంలోని ఇటిక్యాల గ్రామంలో సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలోగౌడ యూత్ సారధ్యంలో మట్టి వినాయకుని విగ్రహ ప్రతిష్టా మహోత్సవం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు.గ్రామంలోని హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన విగ్రహ ఊరేగింపు భక్తిభావంతో సాగింది.మహిళలు మంగళహారతులు, సన్నాయి మేళ వాయిద్యాల నాదం మధ్య, "గణపతి బప్పా మోరియా" అంటూ భక్తి పారవశ్యంతో నినాదాలు చేస్తూ మట్టి వినాయకుని విగ్రహాన్ని గౌడ సంఘ భవనం వరకు తీసుకువచ్చారు.గౌడ సంఘ భవనంలో వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ,శాస్త్రోక్తంగా విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారికి అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించారు.పూజా కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు.పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కు బదులుగా సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇది భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాబోయే తొమ్మిది రోజులపాటు గౌడ సంఘ భవనంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు భజనలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు జవ్వాజీ నర్సాగౌడ్, గౌడ యూత్ అధ్యక్షులు మరిపెల్లి రాజశేఖర్ గౌడ్, గౌడ సంఘ కార్యవర్గ సభ్యులు,గౌడ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












