జగిత్యాల, 9 September
గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో, జిల్లా పోలీసులు మండపాల నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు. మండపాల ఏర్పాటుకు ముందుగా ఆన్లైన్లో అనుమతి పొందాలని, దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
గణేష్ మండపాల నిర్వాహకులకు జిల్లా పోలీసుల సూచనలు గణేష్ నవరాత్రి ఉశ్చవాల సందర్బంగా మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని జిల్లా పోలీసులు సూచించారు.గణేష్ మండపాల ఏర్పాటుకు ముందుగా ఆన్లైన్లో అనుమతి పొందాలని తెలిపారు. భద్రత,బందోబస్తు కోసమే ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని, ఎలాంటి రుసుము లేదని స్పష్టం చేసారు.మండపాల వద్ద ఎలాంటి రుసుములు వసూలు చేయరాదని, అలాగే మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్ ద్వారా అనుమతి పొందాలని కోరారు.శాంతియుతంగా భక్తి శ్రద్దలతో గణేష్ నవరాత్రి ఉచ్చవాలను నిర్వహించాలని జిల్లా ఎస్ పి శ్రీ అశోక్ కుమార్ IPS సూచించారు.












