భవిష్యత్తులో (ధర్మ రథం) సెప్టెంబర్ 06
జగిత్యాల పట్టణంలో సాయిబాబా గుడి ఎదురుగా డా. నవీన్ అనూప్ ఆధ్వర్యంలో జీనియస్ చెస్ అకాడమీని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య పాల్గొన్నారు.
జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం జగిత్యాల: పట్టణంలోని సాయిబాబా గుడి ఎదురుగా డా. నవీన్ అనూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో చెస్ ఎంతో ఉపయోగకరమని అన్నారు. చిన్న వయసు నుంచే విద్యార్థులను చెస్ వంటి మేధో క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. జీనియస్ చెస్ అకాడమీ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, జగిత్యాల పట్టణంలో చెస్ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చెస్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాకుండా విద్యార్థుల్లో ఏకాగ్రత, సహనం, తార్కిక ఆలోచన, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని సూచించారు. జీనియస్ చెస్ అకాడమీని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి చెస్ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు జీనియస్ చెస్ అకాడమీతో విద్యార్థులకు మెరుగైన అవకాశాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షులు అనిల్, పంబాల రాము, శరత్ రావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, చెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.










