జగిత్యాల, 2026-08-16
జగిత్యాల జిల్లా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయి. వారి నివాస ప్రాంతాల వద్దనే సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం 17.08.2026 నుంచి అమలులోకి రానుంది.
ప్రజల సమస్యలను వారి నివాస ప్రాంతాలకు మరింత చేరువలో పరిష్కరించడంతో పాటు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన స్పందనను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ....4, () , 04.08.2026 ప్రకారం, జగిత్యాల జిల్లాలో రేపటి నుంచి అనగా 17.08.2026 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ( )లో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిర్వహిస్తున్న జిల్లా స్థాయి మరియు రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని, వీటికి అదనంగా ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా మండల స్థాయి ప్రజావాణిని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఎంపీడీఓ నోడల్ అధికారిగా బాధ్యతలు
మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి () నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు ప్రజావాణికి తప్పనిసరిగా హాజరై, ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు ప్రారంభించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మండల స్థాయి ప్రజావాణికి ఎంపీడీఓ, తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, మండల వ్యవసాయ అధికారి, ఉద్యానవన అధికారి, పశువైద్యాధికారి, మత్స్యశాఖ అధికారి, మండల విద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, సీడీపీఓ, అంగన్వాడీ సూపర్వైజర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, గృహ నిర్మాణ, గ్రామీణ నీటి సరఫరా, రహదారులుభవనాలు, నీటిపారుదల, భూగర్భ జల, అటవీ, విద్యుత్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత ఇతర మండల స్థాయి అధికారులు హాజరవుతారని తెలిపారు.
ప్రతి వినతి ఆన్లైన్లో నమోదు
మండల స్థాయి ప్రజావాణిలో అందే ప్రతి వినతిని ఏకీకృత ప్రజావాణి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేస్తారని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుదారులు సమర్పించే వినతిపత్రంతో పాటు సంబంధిత ఆధారాలు, ధ్రువపత్రాలను స్కాన్ చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారని పేర్కొన్నారు. వినతి నమోదు చేసిన అనంతరం దరఖాస్తుదారుడికి గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదు అందజేస్తారని తెలిపారు. ఈ గ్రీవెన్స్ ఐడీ ఆధారంగా దరఖాస్తుదారులు తమ ఫిర్యాదు పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తమ వినతులకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబర్, చిరునామా, అవసరమైన ఆధారాలు, గతంలో సమర్పించిన దరఖాస్తుల వివరాలు ఉంటే వాటిని వెంట తీసుకురావాలని సూచించారు.
ప్రత్యేక సహాయ కేంద్రాల ఏర్పాటు












