జగిత్యాల, 2026-06-05
జగిత్యాల జిల్లాలో ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
జగిత్యాల జిల్లాలో ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి కె.వై. ప్రసాద్ లతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ, జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల నుండి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రజావాణికి వస్తారని తెలిపారు. అధికారులు తమ శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు, సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 53 ఫిర్యాదులు, వినతులు అందాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులచే పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా భవన్ (హైదరాబాద్) ముఖ్యమంత్రి ప్రజావాణి, జగిత్యాల జిల్లా ప్రజావాణికి సంబంధించి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వచ్చే ప్రజావాణి వరకు పరిష్కరించాలని, లేని యెడల దరఖాస్తుదారులకు తగిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
అనంతరం నేత్రదానం - శ్రేష్ఠ దానం కార్యక్రమంలో భాగంగా 41వ నేత్రదాన పక్షోత్సవాలు ఆగష్టు 25 నుండి సెప్టెంబర్ 25 వరకు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, జిల్లా పరిపాలన యంత్రాంగం తరఫున నేత్రదానాన్ని ఒక సామాజిక ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. మరణానంతరం మన నేత్రాలను దానం చేయడం ద్వారా చూపులేని ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని, ఇది మనిషి చేయగల అత్యంత గొప్ప పనులలో ఒకటని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు మరియు తదితరులు పాల్గొన్నారు.









