కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలంలోని హాసన్ టాక్లీ (చిన్న టాక్లీ) గ్రామంలో సాహిత్య సామ్రాట్, లోక్ షాహిర్ అన్నాబాహు సాఠె గారి 106వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు.
కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలంలోని హాసన్ టాక్లీ (చిన్న టాక్లీ) గ్రామంలో సాహిత్య సామ్రాట్, లోక్ షాహిర్ అన్నాబాహు సాఠె గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన 106వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అభినవ అంబేద్కర్, సామజిక ఉద్యమ నేత, మాదిగ ముద్దుబిడ్డ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. ఆయన విచ్చేసినందుకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా, మంద కృష్ణ మాదిగ వస్తున్నారని తెలుసుకుని హాసన్ టాక్లీకి విచ్చేసిన మాదిగ మేధావులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, జర్నలిస్టులు, యం.ఆర్.పీ.యస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.









