జగిత్యాల, 15 September
జగిత్యాల పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ గణేష్ మండళ్లు గణనాథుడిని అయ్యప్ప స్వామి, నరసింహస్వామి, కాశీ విశ్వనాథుడు, పాతాళ గణపతి వంటి విభిన్న అవతారాల్లో అలంకరించి భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఈ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విభిన్న అవతారాల్లో వినాయకుడు.. భక్తులను ఆకట్టుకుంటున్న రూపాలు గణనాథుడికీ .. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ : జగిత్యాల పట్టణంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా వివిధ గణేష్ మండళ్ల ఆధ్వర్యంలో గణనాథుడిని విభిన్న అవతారాల్లో... శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు అయ్యప్ప స్వామి అవతారంలో, ఇరుముడి ధరించిన రూపంలో కొలువుదీరిన.. కృష్ణనగర్లో టీమ్ కాళీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు నరసింహస్వామి చేతిలో కొలువుదీరిన... అరవింద్నగర్లో బాల గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు కాశీ విశ్వనాథుడి అవతారంలో, శివలింగంతో కూడిన ప్రత్యేక రూపంలో కొలువుదీరిన... అదే అరవింద్నగర్లో శ్రీ గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు శ్రీకాళహస్తి పాతాళ గణపతి రూపంలో ప్రత్యేక అలంకరణతో కొలువుదీరిన.. ఈ సందర్భంగా ఆయా వినాయక మండపాలను జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ సందర్శించి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జగిత్యాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. విభిన్న అవతారాల్లో గణనాథుడిని అలంకరించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పిస్తున్న నిర్వాహకుల కృషిని ప్రశంసించారు.












