Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 11
గణేష్ నవరాత్రుల సందర్భంగా మధిర పట్టణంలో గణపతి విగ్రహాలను ప్రతిష్టించే నిర్వాహకులు తప్పనిసరిగా స్థానిక పోలీసుల నుంచి అనుమతులు పొందాలని ఎస్.హెచ్.ఓ. దోమల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన కోసం ఆన్లైన్లో ఇంటిమేషన్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు.
*గణేష్ మండపానికి పోలీసుల అనుమతులు తప్పనిసరి* *మధిర టౌన్ ఎస్.హెచ్.ఓ దోమల రమేష్* గణేష్ నవరాత్రుల నవరాత్రులలో భాగంగా పట్టణ వీధుల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టపన చేసే నేపథ్యంలో నిర్వాహకులు మధిర టౌన్ పోలీసుల నుంచి తప్పకుండా అనుమతులు పొందాలని ఎస్ హెచ్ ఓ డి.రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గణేష్ విగ్రహ ఏర్పాటు చేసే నిర్వాహకులకు పోలీస్ ఇంటిమేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందాలన్నారు.వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా ఇన్టిమేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.గణేష్ మండపం ఏర్పాటు చేసే ప్రదేశం,ప్రతిష్ఠాపన తేదీ,నిమజ్జనం తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేస్తూ నిర్వాహకుల పూర్తి వివరాలను మొబైల్ నంబర్ను తప్పనిసరిగా అందించాలన్నారు.పోలీస్ శాఖ సూచించే శాంతి భద్రతలు,ట్రాఫిక్ ఇతర నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని,ఉత్సవ నిర్వాహకులు నిర్ణీత సమయంలో ఇన్టిమేషన్ దరఖాస్తు సమర్పించుకోవాలని సూచించారు












