Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 10
మధిర పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో రేపు వాసవి మాతకు పసుపు కొమ్ములతో విశేష అలంకరణ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి.
*రేపు వాసవి మాతకు పసుపు కొమ్ముల అలంకరణ.* *ఉదయం 10 గంటలకు గోపూజ, తులసి పూజ.* *మధిరలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో రేపు వాసవి మాతకు పసుపు కొమ్ములతో విశేష అలంకరణ కార్యక్రమంఘనంగానిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు గోపూజ, తులసి పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాసులు శేషాచార్యులు గారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతోనిర్వహించనున్నారు.ఈ పవిత్ర కార్యక్రమంలో మహిళలు, వాసవి మాత భక్తులు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని, వాసవి మాత కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.*












