తదుపరి (ధర్మ రథం) నవంబర్ 28
మధిర సీనియర్ సివిల్ న్యాయమూర్తి కోర్టులో సత్తుపల్లి ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి మారగాని శ్రీనివాస్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మధిరలో స్థానిక సీనియర్ సివిల్ న్యాయమూర్తి కోర్టులో జరిగిన తనిఖీ నిమిత్తం సత్తుపల్లి ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి మారగాని శ్రీనివాస్ మధిర కోర్టును సందర్శించారు. తనిఖీ అనంతరం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మధిర సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్ ప్రశాంతి, జూనియర్ సివిల్ న్యాయమూర్తి వేముల దీప్తి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అనంతరం 6వ అదనపు జిల్లా న్యాయమూర్తిని న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ముందుగా జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, మధిర మృత్యుంజయ స్వామి ఆలయాలను దర్శించుకున్న అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ చావలి రామరాజు, సీనియర్ న్యాయవాదులు వాసంశెట్టి కోటేశ్వరరావు, డి జగన్మోహన్రావు, పల్లపోతుల కృష్ణారావు, నెల్లూరి రవి, సతీష్, జ్ఞానేష్, రమేష్, మాధురి, నాగలక్ష్మి, శ్రీనివాస్, కోర్టు సిబ్బంది, సూపరింటెండెంట్లు సురేంద్రమణి, వెంకన్న, మల్లేశ్వరరావు, మల్లేశ్వరరావు, సూర్యనారాయణ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



