నడిగూడెం, 2026-11-28
సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. హరి సింగ్ నడిగూడెం మండలంలో పర్యటించి, రీసర్వే పనులను, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు.
సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. హరి సింగ్ నడిగూడెం మండలంలో పర్యటించి, గ్రామాలలో కొనసాగుతున్న రీసర్వే పనుల పురోగతిని సమీక్షించారు. రీసర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనులను నిర్దేశిత సమయంలో పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం నడిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించే లక్ష్యంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. అర్హులైన కుటుంబాలందరికీ పథకం వివరాలను తెలియజేసి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో నడిగూడెం తహసీల్దార్ ఎల్. మంగ, నాయబ్ తహసీల్దార్ జె. సుధీర్ కుమార్ జి పి ఓ లు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.



