కేశంపేట్, 14 September
మండలం నిర్ధవెల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని 12 వినాయక మండపాల నిర్వాహకులకు బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు తోట వెంకటేష్ ఆధ్వర్యంలో 25 కిలోల చొప్పున బియ్యం బస్తాలను పంపిణీ చేశారు.
నిర్ధవెల్లిలో వినాయక మండపాలకు బియ్యం పంపిణీ నిర్ధవెల్లి: మండలం నిర్ధవెల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాలకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు తోట వెంకటేష్ గ్రామంలోని 12 వినాయక మండపాల నిర్వాహకులకు 25 కిలోల చొప్పున బియ్యం బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా తోట వెంకటేష్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఆధ్యాత్మికత, ఐక్యతను పెంపొందించేలా పండుగ వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు ఉమాపతి, మాజీ వైస్ ఎంపీపీ సురేందర్, వార్డు సభ్యులు తోట చెన్నయ్య, వడ్ల జంగచారి, సిల్వేరు మల్లయ్య, సాకలి జంగయ్య, శంకర్ నాయక్, బండ నిరంజన్, పినమొని బాలరాజు, బోడ రాములు, సిల్వేరు సుధాకర్, ఏర్గమోని శేఖర్, వై. యాదయ్య, సకలి మహేష్, ఎస్. శివ, ఏ. మహేష్, తరుణ్, హరీష్, అరుణ్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.












