కాజీపేట్, 2026-08-10
నర్సంపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ ఉద్యమ నాయకుడు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకార్థం సోమవారం కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి నిస్వార్థ తెలంగాణ ఉద్యమకారుడని, ప్రజల కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు.
నర్సంపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ ఉద్యమ నాయకుడు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకార్థం సోమవారం కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై పెద్ది సుదర్శన్ రెడ్డి భారీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ ఉద్యమకారుడిగా కొనియాడిన దాస్యం
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి నిస్వార్థ తెలంగాణ ఉద్యమకారుడని, ప్రజల కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తామిద్దరం కలిసి అనేక ఉద్యమాలు, రాస్తారోకోలు, రైల్ రోకోలు, బంద్‌లు, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఉద్యమ కాలంలో అనేక కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరిగిన రోజులు మరువలేనివని పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పెద్ది సుదర్శన్ రెడ్డి విశేష కృషి చేశారని, ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
విగ్రహం గద్దె కూల్చివేతపై ఆగ్రహం
స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాప్రతినిధి విగ్రహ ఏర్పాటును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వమే అధికారికంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్, మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, సోద కిరణ్, వద్దిరాజు గణేష్, ఎండి అఫ్జల్, ఎండి హుస్సేన్, డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్, దువ్వ కనకరాజ్, బెదురుకోట రంజిత్, గబ్బేట కరుణ్ (సిద్దు), బరిగెల వినయ్, ఎస్.కె. మహమూద్, దువ్వ నరేష్ (కిట్టు), మాచర్ల ప్రభాకర్, కంజర్ల మనోజ్, కొండ శంకర్, మరియాల కృష్ణ, తండముల వేణు, రాబర్ట్, సయ్యద్ యాకూబ్, మంద రాజ్‌కుమార్, బండి రామచందర్, పడిదల శేఖర్, బరబరి శ్రీకాంత్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.











