ధర్మపురి, 3 August
దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థలలో ఆడియో, వీడియో రికార్డింగ్ సదుపాయం గల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీస్ స్టేషన్లలో విచారణ గదులు, లాకప్లు, మరియు ఇతర ముఖ్యమైన ప్రాంతాలన్నీ నిరంతరం సీసీటీవీల నిఘా నీడలోనే ఉండాలని స్పష్టం చేసింది.

హక్కుల పరిరక్షణే ధ్యేయం
రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయని న్యాయస్థానం తెలిపింది. పోలీస్ కస్టడీలో జరిగే హింసను నిరోధించడానికి, మానవ హక్కుల ఉల్లంఘనల నుండి పౌరులను రక్షించడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 భరోసా ఇస్తుందని గుర్తుచేసింది.
పారదర్శకత, జవాబుదారీతనం పెంపు
ఈ నిరంతర సీసీటీవీ నిఘా వల్ల పోలీసుల విచారణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతో పాటు నిష్పక్షపాతమైన దర్యాప్తునకు వీలవుతుందని కోర్టు అభిప్రాయపడింది. పౌరుల ప్రాణాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించేలా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ రాజ్యాంగబద్ధమైన హక్కులను, చట్టబద్ధమైన పాలనను నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అత్యున్నత న్యాయస్థానం నొక్కిచెప్పింది.
చారిత్రాత్మక తీర్పు
2020 నాటి ప్రముఖ పరంవీర్ సింగ్ సైనీ వర్సెస్ బల్జీత్ సింగ్ అండ్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక మార్గదర్శకాలను వెలువరించింది.