రాయికల్, 2026-06-05
ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న సీపీఎస్ () ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం () ను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో రాయికల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ మేరకు పెన్షన్ విద్రోహ దినంగా ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలులో ఉన్న సీపీఎస్ () ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం () ను పునరుద్ధరించాలని టీజీఈజేఏసీ () ఆధ్వర్యంలో రాయికల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చిరంజీవి అధ్యక్షతన భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి, పెన్షన్ విద్రోహ దినంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
ఈ నెల 10వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిరంజీవి, ఎంపీవో సుష్మ, సూపరిండెంట్ ప్రవీణ్, పంచాయతీ సెక్రెటరీల సంఘం అధ్యక్షుడు ఎల్. శేఖర్, వైస్ ప్రెసిడెంట్ జి. సాయి కృష్ణ, సెక్రెటరీ డి. నరేష్, ఆదిరెడ్డి, రాజేష్, సంతోష్, కళ్యాణ్, రాజేష్, దేవదాస్, అమీర్, శ్రీనివాస్, తిరుమల్, రాజేష్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












