రాయికల్, 3 September
పట్టణానికి చెందిన డాక్టర్ పడాల తిరుపతి రాష్ట్రస్థాయిలో ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయనుంది.
రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా రాయికల్ వాసి పట్టణానికి చెందిన డాక్టర్ పడాల తిరుపతి రాష్ట్రస్థాయిలో ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికైనారు. ఈ నెల 5న జరిగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంచే పురస్కారం పొందనున్నారు శాతవాహన యూనివర్సిటీలో వృక్షశాస్త్ర విభాగ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ పడాల తిరుపతి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపిక కావడం పట్ల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సేవా విభాగం కన్వీనర్ చెరుకు మహేశ్వర శర్మ,టి ఆర్ టియఫ్ రాష్ట్ర కన్వీనర్ ముక్కెర శేఖర్ మండలం విద్యాధికారి యస్.రాఘవులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొల్లూరి రాజేందర్,ఎద్దండి రమేష్ పుర ప్రముఖులు తదితరులు అభినందనలు తెలిపారు.











