సిరిసిల్ల, 2027-09-12
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ () శాఖకు 20262027 సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో డా. చికోటి సంతోష్ కుమార్ అధ్యక్షుడిగా, డా. తడుక సాయి కుమార్ జనరల్ సెక్రటరీగా, డా. జైల్ సింగ్ ట్రెజరర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త IMA కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక రాజన్న : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖకు 2026–2027 సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన IMA జనరల్ బాడీ సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. డా. చికోటి సంతోష్ కుమార్‌ను జిల్లా IMA అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. డా. తడుక సాయి కుమార్ జనరల్ సెక్రటరీగా, డా. జైల్ సింగ్‌ను ట్రెజరర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా డా. పి. యోగేంద్ర, డా. జి. అభినయ్లను వైస్ ప్రెసిడెంట్లుగా, డా. వెంకట్, డా. మోహన్ కృష్ణ, డా. చందునిలను జాయింట్ సెక్రటరీలుగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియకు డా. మనోహర్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. మాజీ IMA అధ్యక్షురాలు డా. శోభారాణి సమక్షంలో కొత్త కార్యవర్గం ఎన్నిక జరిగింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డా. చికోటి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, ప్రత్యేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలోని వైద్యుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణతో పాటు వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి IMA కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలకు అందించే వైద్య సేవలను మరింత బలోపేతం చేసి, అత్యవసర వైద్య సేవల వ్యవస్థను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. కొత్త కార్యవర్గానికి పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.








