ధర్మపురి, 27 July
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోషకాహార అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. నృసింహ మహా యాగంలో పాల్గొన్న ఆయన, అనంతరం కిచెన్ తో పాటు మిల్క్ యూనిట్ ను కూడా ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోషకాహార అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమం భవిష్యత్ లో దిగ్విజయంగా ముందుకు సాగాలని జరిపించిన నృసింహ మహా యాగంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను, విద్యార్థులకు అల్పాహారంతో పాటుగా అందించే మిల్క్ యూనిట్ ను ప్రారంభించారు. అల్పాహారం తయారు చేసే యంత్రాలను, కూరగాయలను శుద్ధిచేసే మెషీనరీని, ఇతర అన్ని రకాల ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు.
విద్యార్థులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అల్పాహారం చేశారు. ఇడ్లి, పొంగల్, ఉప్మా, పూరీ, రాగి ఇడ్లి, ఇతర వంటకాలను ఆయన రుచి చూశారు. అల్పాహారం సమయంలో ఆయన విద్యార్థులకు ఇడ్లిలు, ఇతర వంటకాలను వడ్డించారు. భట్టి విక్రమార్క వడ్డించే సమయంలో ఆయనతో మాట్లాడేందుకు, చేయిని కలిపేందుకు విద్యార్థులు ఎంతో ఉత్సాహాన్ని చూపారు.
అనంతరం వివిధ పాఠశాలలకు అల్పాహారాన్ని అందించే వాహనాలను ఉప ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. సభ ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విద్యార్థులంతా ముక్తకంఠంతో పాడడంతో సభ వాతావరణం ఉద్వేగంగా, ఉత్సాహంగా మారింది. వేదిక మీదున్న ఉప ముఖ్యమంత్రి చిన్నారుల ఉత్సహాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సభలో పాల్గొన్న విద్యార్థులు భట్టి.. భట్టి అంటూ నినాదాలు చేయడం విశేషం.











