దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో 50 రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా లోని నాగేశ్వరావు రైస్ మిల్లులో జరిగిన బీసీ చైతన్య సమితి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.
దేశ జనాభాలో 50 పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో 50 రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, 2027లో జరిగే దేశవ్యాప్త జనాభా గణనలో ఓబీసీ కుల గణన జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను కోర్టులు కొట్టివేయడం బాధాకరమని, బీసీ రిజర్వేషన్లను పటిష్టం చేసేందుకు రాజ్యాంగాన్ని సవరించి, షెడ్యూల్ 9లో చేర్చాలని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు. బీసీల సమగ్ర అభివృద్ధికి బీపీ మండల్ సిఫార్సులు అమలు చేయాలని, దశాబ్దాలుగా పరిష్కారం కాని బీసీ డిమాండ్లపై, బీసీలలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు విద్యార్థి, యువజన, మహిళా కమిటీలను గ్రామ గ్రామాన వేస్తూ బీసీ ఉద్యమ బలోపేతానికి కృషి చేస్తామని బీసీ రమణ అన్నారు. సమావేశానంతరం , సూర్యాపేట పట్టణ కమిటీలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగార్జునపు రాజ్యలక్ష్మి, సూర్యాపేట జిల్లా యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చేన్నోజు ధనలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సురోజు జ్యోతి, మహిళా రాష్ట్ర కార్యదర్శి భోజన పల్లి గోవిందమ్మ, సూర్యాపేట జిల్లా సంస్కృతిక అధ్యక్షుడు గుగ్గిళ్ళ సతీష్ చారి, మండల కార్యదర్శి కంబాల ధనలక్ష్మి, సూర్యాపేట పట్టణ అధ్యక్షురాలు బెజ్జంకి చంద్రకళ, ఉపాధ్యక్షురాళ్లు రాజరికం కళావతి, మారోజు ఈశ్వరమ్మ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగోజు శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.












