మండల కేంద్రానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ పరమేష్లను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన అధికారులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
మండల కేంద్రానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ పరమేష్లను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన పోలీసు అధికారులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా బదిలీపై వెళ్తున్న సీఐ నరహరికి కాంగ్రెస్ నాయకులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ, పోలీసు శాఖపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించేలా పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడ విరేష్, అల్వాల్ సర్పంచ్ సురేష్ రెడ్డి, బోధనంపల్లి సర్పంచ్ నగేష్, తోమిదిరేకుల సర్పంచ్ బీసీ కవిత, కరుణాకర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రావుల పెంటయ్య, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాణి, సీనియర్ నాయకులు రఘుపతి, తుమ్మల గోపాల్, మల్లేష్, భీమయ్య, బాలోజీ, జంగయ్య, ప్రకాష్, గ్యారా సురేష్, కోడూరు నర్సింలు, లింగం, అంజయ్య, కుమార్, రూప్లా నాయక్, రాములు, ఆంజనేయులు, యాదగిరి, శ్రీకాంత్ రెడ్డి, పాండు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.












