సూర్యాపేట జిల్లా మండలంలో నెలకొన్న విద్యుత్ సమస్యకు తెరపడింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల చొరవతో సబ్ స్టేషన్ కు 8 సామర్థ్యం గల కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. దీంతో రైతులు, ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం తొలగిపోయింది.
గత కొద్ది రోజులుగా సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో మండలంలో విద్యుత్ సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సమస్యను కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డిల దృష్టికి తీసుకువెళ్లారు.
విషయం తెలుసుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు వెంటనే విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో సంప్రదించి, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆదేశాల మేరకు అధికారులు స్పందించి, సబ్ స్టేషన్ కు 8 సామర్థ్యం గల కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు.
కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో మండలంలో విద్యుత్ సమస్య పూర్తిగా పరిష్కారమైంది. ఈ సందర్భంగా చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దున్న శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎలుగురి నాగరాజు, వార్డ్ మెంబర్లు, వివిధ గ్రామాల నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.











