Suryapet/Munagala (ధర్మ రథం) ఆగస్టు 02
మునగాల మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన మల్లు సంజీవరెడ్డిని బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన మునగాల మండల ఎమ్మార్పీఎస్ నాయకులు మాదాసు నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి గౌరవించారు. మండలంలో శాంతి భద్రతలను కాపాడడానికి కృషి చేస్తానని ఎస్ఐ మల్లు సంజీవరెడ్డి తెలిపారు.
మునగాల మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన మల్లు సంజీవరెడ్డిని బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన మునగాల మండల ఎమ్మార్పీఎస్ నాయకులు మాదాసు నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి గౌరవించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మల్లు సంజీవరెడ్డి మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతలను కాపాడడానికి తన వంతుగా కృషి చేస్తానని, ప్రజలందరి సహాయ సహకారాలు ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే సామెల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుల్లెద్దు వెంకటేశ్వర్లు, జిల్లే పెళ్లి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.








