హైదరాబాద్, 2026-06-05
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు త్వరలోనే ధరల షాక్ తగిలే అవకాశం ఉంది. మద్యం తయారీ వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, తమకు చెల్లించే బేసిక్ ప్రైస్‌ను సవరించాలని డిస్టిలరీలు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ 8 శాతం వరకు ధరలను పెంచవచ్చని సిఫార్సు చేసింది.
తెలంగాణలో మద్యం ప్రియులకు త్వరలోనే ధరల షాక్ తగిలే అవకాశం ఉంది. మద్యం తయారీ వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, తమకు చెల్లించే బేసిక్ ప్రైస్‌ను సవరించాలని డిస్టిలరీలు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
8 శాతం పెంపునకు కమిటీ సిఫార్సు
దీనిపై ప్రభుత్వం ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మద్యంపై 8 శాతం వరకు ధరలను పెంచవచ్చని సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. డిస్టిలరీల డిమాండ్‌ను నెరవేర్చడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ ఈ కసరత్తు చేసింది.
సీఎం ఆమోదంతోనే తుది నిర్ణయం
మద్యం ధరల పెంపుపై కమిటీ ఇచ్చిన నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్లు తెలిసింది. సీఎం ఆమోద ముద్ర లభించగానే ధరలను సవరించనున్నట్లు సమాచారం.












