మునగాల, 3 September
వినాయక చవితి పండుగ సమీపిస్తున్న , సూర్యాపేట జిల్లా బరాకత్ గూడెం గ్రామంలో వినాయక విగ్రహాల తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి. వివిధ ఆకృతులు, పరిమాణాలు, ప్రత్యేక అలంకరణలతో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ, కళాకారులు భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
*వినాయక విగ్రహాల తయారీలో నిత్య నిర్వాహకుల సందడి* ,నిఘానేత్రం . వినాయక చవితి పర్వదినం సమీపిస్తున్న మండల పరిధిలోగల బరాకత్ గూడెం గ్రామంలో నిత్య గణనాథుల విగ్రహాల తయారీ నిర్వాహకుల పనులు జోరందుకున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలకు వివిధ ప్రాంతాల్లోని నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను సిద్ధం చేయించే పనుల్లోనిమగ్నమయ్యారు.వివిధ ఆకృతులు, పరిమాణాలు, ప్రత్యేక అలంకరణలతో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ నిత్య నిర్వాహకులు భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహాల తయారీలో కళాకారులు ఎన్నో రోజులుగా శ్రమిస్తూ గణపతి ప్రతిమలకు తుది రూపాన్ని అందిస్తున్నారు. చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాల వరకు భక్తుల అభిరుచికి అనుగుణంగా తయారీ కొనసాగుతోంది. వినాయక చవితి సందర్భంగా మండపాల్లో ప్రతిష్ఠించే విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఏర్పాట్లు చేస్తూ మండపాల అలంకరణ, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టమ్, భక్తుల కోసం అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లపై ఉత్సవ కమిటీ సభ్యులు దృష్టి సారిస్తున్నారు.అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మట్టి, పర్యావరణహిత పదార్థాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ,పీఓపీ విగ్రహాల వల్ల నీటి వనరులకు కాలుష్యం కలిగే అవకాశం ఉన్నందున పర్యావరణహిత విగ్రహాల వైపు ప్రజలు మొగ్గు చూపాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. గణనాథుడి విగ్రహాల తయారీతో స్థానిక కళాకారులకు ఉపాధి లభించడంతో పాటు పండుగ వాతావరణం గ్రామాల్లో, పట్టణాల్లో నెలకొంటోంది.












