జగిత్యాల, 13 October
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని 3వ వార్డులో గాయత్రి మేక్ ఓవర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని 3వ వార్డులో గాయత్రి మేక్ ఓవర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జ్యోతి లక్ష్మణ్ సందేశం
జ్యోతి మాట్లాడుతూ మన సంస్కృతి.. మన సంప్రదాయం.. మన బతుకమ్మ.. మన ఆత్మీయత.. అనే నినాదంతో నిర్వహించిన ఈ వేడుకలు తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, పూల పండుగ గొప్పతనానికి ప్రతీకగా నిలిచాయి. బతుకమ్మ పండుగ మన తెలంగాణ అస్తిత్వాన్ని, మహిళల ఐక్యతను, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని చాటిచెబుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాగుల ప్రదీప్ కుమార్, సిద్ధి హిందూ యూత్ సభ్యులు, మహిళలు, పిల్లలు, భగవత్ బాంధవులు పాల్గొన్నారు.












