మండలంలో రూరల్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తాళ్లపల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా కొత్త ఉపేందర్ ఎన్నికయ్యారు.
మండలంలో రూరల్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ మండల కమిటీ అధ్యక్షులుగా తాళ్లపల్లి భాస్కర్, ఉపాధ్యక్షులుగా కే నాగభూషణం, ప్రధాన కార్యదర్శిగా కొత్త ఉపేందర్, గౌరవ అధ్యక్షులుగా ఎస్కే బడే మియా, సహాయ కార్యదర్శిగా జానపాటి వీరబాబు, కోశాధికారిగా నవీన్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్.కె నసీర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బెల్లంకొండ రాంబాబు, మరో సహాయ కార్యదర్శిగా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. సతీష్, రఫీలను కూడా నూతన కమిటీలో సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో సూర్యాపేట జిల్లా రూరల్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దొంతగాని రవిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు భూతం శ్రీనివాసరావు, జిల్లా నాయకులు గౌడ్, మునగాల మండల అధ్యక్షులు శ్రీశైలం, కోదాడ మండల అధ్యక్షులు పి నాగరాజు పాల్గొన్నారు.











